1 May, 2026 | 2:21 PM

Breaking News

మే 4న జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి   •   సూర్యాతండలో చిన్న జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు   •   సింగరేణి ఏరియాలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం   •   దురాక్రమణ యుద్ధ భారాలకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై ఉద్యమిద్దాం   •   మేడే స్ఫూర్తితో కార్మికులు హక్కుల సాధనకై ఉద్యమించాలి   •   కళ్యాణం కమనీయం   •   తెలంగాణ పోలీస్ దేశంలోనే నెం.1: డీజీపీ సీవీ ఆనంద్   •   నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం   •   విహార నౌక బోల్తా: తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య   •   జడ్చర్లలో దారుణం... చెట్ల పొదల్లో శిశువు మృతదేహం   •  

మీ ఇండ్లలో ఇలాగే తింటారా?

10-03-2026 01:38 AM

నాసిరకమైన మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ అసంతృప్తి

ఇద్దరికీ షాకాజ్ నోటీసులు జారీ

నాగర్కర్నూల్, మార్చి 9 (విజయక్రాంతి): జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పా ఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జి ల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సోమవారం కిచిడీ, గుడ్డు, మికస్డ్ వెజిటేబుల్ కర్రీ ఇవ్వాల్సి ఉండగా, పాఠశాలలో మాత్రం వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు గమనించారు.

అలాగే వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా బాగోలేదని కలెక్టర్ అసంతృ ప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచ్ప తీవ్రంగా మందలించారు.  ఎందుకు విధుల నుండి సస్పెండ్ చేయకూడదో ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ కు ఫోన్ ద్వారా ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రో జువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని హెడ్మాస్టర్కు సూచించా రు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి పరీక్షకు ధైర్యంగా హాజరై మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు.

ఈ విద్యా సంవత్సరం 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకా నున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి చీపురు పట్టి పాఠశాల ప్రాంగణంలో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీఓ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.