అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
15-07-2026 07:04 PM
నిర్మల్,(విజయ క్రాంతి): మామడ మండల కేంద్రంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ గోదాం నిర్మాణం పూర్తయిన అనంతరం రైతులకు ధాన్యం నిల్వలో సౌలభ్యం కలగడంతో పాటు, వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.






