హరీష్ రావును విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదు
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావుపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని హరీష్ రావును విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీర్ల ఐలయ్య గత చరిత్ర ఏందో ఆలేరు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఐలయ్య తన స్థాయిని మరచి విమర్శలు చేస్తున్నారని త్వరలోనే ప్రజాక్షేత్రంలో బీర్ల ఐలయ్యకు తగిన గుణపాఠం తప్పదని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కర్రే వెంకటయ్య అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వo అధికారంలోకి వచ్చాక నీ అవినీతిని అంతా బయటపెట్టి జైలుకు పంపిస్తాం అని అన్నారు.






