మంత్రిని కలిసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆలేరు, ఫిబ్రవరి 27 : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కలెక్టర్ కి మంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా పేదలకు చేరేలా, అర్హులైన వారికి లబ్ది జరిగేలా పని చేయాలని, ఈ వృత్తిని బాధ్యతగా భావించి పేదల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి నూతన కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు.




