కేజీబీవీలో నలుగురు ఉద్యోగుల టర్మినేషన్
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మార్చి ౫ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గల అర్బన్ కేజీబీవీ పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించిన నలుగురు ఉద్యోగులను గురువారం టర్నెట్ చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాలకు ప్రార్థన సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉం డాల్సిన ఎస్‌ఓ సుజాతతో పాటు ముగ్గురు సిఆర్టిలు విధులు నిర్వహణలో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు సమయపాల న పాటించకపోగా తరచుగా ఆలస్యంగా వస్తున్నట్లు విచారణ చేసిన కలెక్టర్ వారిని వెంటనే విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగించాలని డీఈవో దర్శనం భోజన్నను ఆదేశించారు.
గురువారం సాయం త్రం జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు నలుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి నలుగురిని సస్పెండ్ చేయడంపై జిల్లా విద్యాశాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ ఘటన మిగతా కేజీబీవీ పాఠశాలలో పనిచేసే ఉద్యోగులకు హెచ్చరిక లాంటిదని చర్చ జరుగుతుండగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వదిలి కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంపై చర్చ జరుగుతుంది.
పట్టణంలో ప్రజల అవసరాలను తీర్చాలి
పట్టణ ప్రజల మౌలిక వసతులను కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డులను సందర్శించారు. వార్డులో నిర్వహిస్తున్న చిత్త సేకరణ మురికి కాలువల శుభ్రత పరిసరాల పరిశుభ్రత తాగునీటి సరఫరా విద్యుత్ లైట్లు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ అధికారులు ప్రతిరోజు వార్డులో సంద ర్శిం చాలని తెలిపారు. పట్టణ అభివృద్ధికి మంజూరు అని నిధులను సమర్థవంతంగా ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మిషన్ భగీరథ ఈ సందీప్ కుమార్ మున్సిపల్ అధికారులు స్థానిక కౌన్సిలర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.




