2 May, 2026 | 4:55 PM

బాధ్యతలు స్వీకరించిన డిస్కంల సీఎండీలు

28-02-2026 12:00 AM

నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం : జితేష్ వీ పాటిల్

కొత్త డిస్కం రూపకల్పనపై దృష్టి: ముషారఫ్ ఫరూఖీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పం పిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జితేష్ వీ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన పాటిల్ 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందిం చిన ఆయన, కామారెడ్డి, భద్రాద్రి జిల్లాల కలెక్ట ర్‌గా కూడా విజయవంతంగా పనిచేశారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వంలో నది జలాలు, గంగా నది ప్రక్షాళన విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా సేవలందించారు.

తాజాగా, ప్రస్తుత సీఎండీ ముషారఫ్ ఫరూఖీ నుంచి కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నిరంతర, నాణ ్యమైన విద్యుత్ సరఫరా అందించడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక కొత్త  డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల్లో చేరిన తొలి రోజునే కొత్త డిస్కం రూపకల్పనపై దృష్టి సారించిన ఆయన, ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త డిస్కం ఏర్పాటు పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.