15 July, 2026 | 2:11 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

ఏ ఒక్కటి చేజారొద్దు

16-02-2026 01:30 AM

హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్సే ఉండాలి

చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై కాంగ్రెస్ నేతలు, మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ సమావేశం 

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ  జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,  రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సోమవారం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల, వైస్ చైర్మన్లు ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహంపై జూమ్ మీ టింగ్‌లో సీఎం దిశా నిర్దేశం చేశారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఎన్ని కాంగ్రెస్‌కి దక్కనున్నాయో పార్లమెంట్ ఇంచార్జిలతో అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్‌చార్జిలు వ్యవహరించాల్సిన అంశాలపై దిశ నిర్దేశం చేసారు. సామాజిక సమతుల్యత పాటించాలన్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఏ ఒక్కటి చేజారకూడదని సీఎం స్పష్టం చేశారు.