calender_icon.png 8 February, 2026 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం

08-02-2026 04:17:28 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి  రాక సందర్భంగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు.

దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొన్నారు.