30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఎక్కువ.. ఆయన తాలిబన్

08-06-2026 12:52 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హిట్లర్ కంటే ఎక్కువ.. ఆయన తాలిబన్ అని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కవిత అన్నారు. 27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదిస్తామంటున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూల్స్ మూసేస్తామంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ విద్యాశాఖను(Telangana Education Department) సర్కస్ లెక్క మార్చేశారు.. శాఖలపై పట్టు కోల్పోయారని ఆరోపించారు. విద్యార్థులను కాలేజీలు దోపిడీ చేయకుండా జీవో 7ను రద్దు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తక్షణమే అమల్లోకి తేవాలని కవిత డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను నాశనం చేసే మీ ప్రయత్నాలను ఆపాలని కవిత కోరారు.