28 March, 2026 | 12:34 PM

మూసీ తీరాన ఓంకారేశ్వర ఆలయం.. వంద అడుగులతో శివుడి భారీ విగ్రహం

28-03-2026 10:31 AM

మూసీ నదీ తీరాన ఓంకారేశ్వర ఆలయం

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో మరో ముందడుగు

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవ( Musi Rejuvenation Project) ప్రాజెక్టులో భాగంగా మరో ముందడుగు పడింది. శ్రీ ఓంకారేశ్వర స్వామి(Sri Omkareshwara Swamy Temple) ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. అలాగే మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయంలో జరిగే ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్(Musi River Front Corporation) ఆలయ నిర్మాణానికి డిజైన్ ఖరారు చేసింది.

చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయం నిర్మిస్తున్నారు. ఎనిమిది ఎకరాల్లో రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఓంకారేశ్వర ఆలయంలో(Omkareshwara Temple) వద్ద అడుగుల గాలి గోపురం నిర్మించనున్నారు. మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం కట్టనున్నారు. మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వీరభద్ర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేశారు.