మూసీ నది పునరుజ్జీవనంపై సర్కార్ కీలక నిర్ణయం
28-03-2026 11:50 AM
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవనానికి(Musi River Rejuvenation) ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పునరుద్ధరణ, వరద నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సుస్థిర నదీతీర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళిక, సమన్వయం, అమలును పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub committee) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) అధ్యక్షత వహించనుండగా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.




