12 July, 2026 | 5:47 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం

27-04-2026 04:56 PM

బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా?

కేసీఆర్ కవిత మాటలకు సమాధానం చెప్పాలి..

హైదరాబాద్: కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు( Kavitha Remarks) సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మర మనిషా.. మనసున్న మనిషా.. కవితకు  జవాబివ్వాలని సవాల్ విసిరారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎక్స్ పైరీ గడువు తీరింది.. ఇక ఆ పార్టీతో పనిచేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చచ్చిన శవంతో సమానం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన శత్రువు కాదన్న సీఎం రేవంత్(CM Revanth ) రాజకీయ ప్రత్యర్థి అన్నారు. కేసీఆర్ కు చెడు జరగాలని కోరుకుంటోంది.. ఆయన కుటుంబమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.