27 July, 2026 | 8:53 PM

Breaking News

సహకార సంఘాల ఎన్నికల సందడి   •   ఎస్సీ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలి   •   అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   అధ్యాపకుడి మృతిపై సంతాప సభ   •   పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్   •   నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు   •   తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక   •   గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది   •   సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ   •   డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్   •  

సీఎం కప్ ఆటల పోటీలు ప్రారంభం

10-02-2026 12:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): స్పోరట్స్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను హకీంపేట్ లోని స్పోరట్స్ స్కూల్లో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, ఫుట్బాల్, సైకిలింగ్ పోటీలు నిర్వహించారు. సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పంపుతామని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి రూ. 75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోరట్స్ స్కూల్ ఓ ఎస్ డి మమత, జిల్లా విద్యాధికా రి ఐ. విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.