మూతబడిన పాఠశాల పరిడవిల్లె
ఉపాధ్యాయుడు మోహన్ కృషిని అభినందించిన గ్రామస్తులు
చేవెళ్ళ ఆగష్టు 11(విజయక్రాంతి): చేవెళ్ళ మండల పరిధిలోని తంగడపల్లి అనుబంధ గ్రామం మడికట్టులో ఎంపీపీ ఎస్ పాఠశాల గత కొన్నేళ్లుగా మూత పడింది. నలుగురు విద్యార్థులతో 2018లో అప్పటి ఎంఈఓ ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తంగడపల్లి గ్రామంలో పనిచేసే ఉపాధ్యాయుడు మోహన్ ను వర్క్ అడ్జస్ట్మెంట్ కింద డిప్యూటేషన్ పై పంపారు.
అయితే ఐదు సంవత్సరాల కాలం పాటు స్కూలుకి ఎలాంటి గ్రాండ్స్ రాకపోవడంతో మోహన్ సొంత ఖర్చులతో బడిని నడిపించారు. 2024లో ఒక డీఎస్సీ పోస్ట్ శాంక్షన్ అయింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులతో కళకళలాడుతుంది. పాఠశాల అభ్యున్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు మోహన్ ను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తంగడపల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.






