14 May, 2026 | 4:48 PM

Breaking News

మల్లాపూర్‌లో ఘనంగా విద్యావారోత్సవాలు   •   బోథ్ మండలకాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా నల్ల శ్రీకాంత్ రెడ్డి నియామకం   •   బోధన్ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం   •   సోనాల మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న   •   విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకే విద్యా వారోత్సవాలు   •   గో రక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు   •   సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలి   •   కోటి 72 లక్షలతో కేజీబీవీ పాఠశాల మరమ్మతులు   •   టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా లక్కినేని శ్యామ్ నియామకం   •   ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి   •  

మట్టి పాత్రలు శుభ్రంగా!

25-05-2025 12:00 AM

ప్రస్తుత చాలామంది మట్టి పాత్రలు వాడుతున్నారు. అవగాహన పెరగడంతో ఇతర పాత్రల వాడకం తగ్గించి, వీటిని వాడేవారు ఎక్కువయ్యారు. మట్టి పాత్రల్లో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి అందరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.

దీనిలో వండిన ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, పాడవ్వకుండా ఉంటుంది. సాంబార్ నుంచి చేపల పులుసు వరకు అన్నీ వీటిలో చేసేస్తున్నారు. అయితే వాడుతున్న కొద్దీ వీటికి అంటుకున్న నూనె మరకలు, ఆహార పదార్థాలు అంత సులువుగా పోవు. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా శుభ్రం చేయొచ్చు. 

l మట్టిపాత్రలను శుభ్రపరిచేటప్పుడు సబ్బు వాడితే జిడ్డు వదిలినా వాసన పాత్రలకే ఉండిపోతుంది. వంటసోడా కలిపిన నీటిని పాత్రల్లో నింపి రెండు నిమ్మచెక్కలు వేసి స్టౌపై పెట్టి మరిగించాలి. తర్వాత నీటిని ఒంపేసి మెత్తని పీచు, శనగపిండితో శుభ్రం చేస్తే సరిపోతుంది. 

l పాత్రలు బూజు పట్టకుండా ఉండాలంటే.. వాటిని కడిగిన తర్వాత ఎండలో బాగా ఆరనివ్వాలి. తర్వాత కొబ్బరి నూనె రాసి కాగితం చుట్టి భద్రపరుచుకోవాలి. ఇలా కనీసం నెలకోసారైనా చెయ్యాలి. అప్పుడే అవి శుభ్రంగా ఉంటాయి.