ప్రతిభ కనబరచిన పోలీసులకు సీఐ అభినందనలు
03-03-2026 12:13 AM
కందుకూరు, మార్చి 2( విజయక్రాంతి): కందుకూరు పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బం దిని ఇన్స్పెక్టర్ కె. సీతారాం ప్రత్యేకంగా అభినందించారు. పెట్రోల్ మొబైల్ కార్ ఇన్చార్జ్ వి. రాజు (హెచ్సీ), డ్రైవర్ ఎం. మధు (ఏఆర్పీసీ), మరియు కె. చరణ్ కుమార్ రెడ్డి (హెచ్సీ) లు క్లిష్ట సమయంలో చాకచక్యంగా వ్యవహరించి,
వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నందుకు వారికి ప్రశంసాపత్రాలు, బహు మతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూశాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో మమేకమై పనిచేయాలని,పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ప్ర తినిత్యం తమ పరిధిలోఅనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి పోలీసులు సేవలందించాలని కోరారు.




