13 May, 2026 | 1:48 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

ట్రెసా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

20-12-2025 01:28 AM

నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ భవనంలో గల  ఐడి ఓసి మీటింగ్ హాల్ లో రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెస్సా అధ్యక్షులు రమన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రెసా అధ్యక్షులు రమణ రెడ్డి మాట్లాడుతూ జీసస్ ప్రభువైన ఏసుక్రీస్తు ఒక నీతి మార్గంలో నడవాలని ప్రజలందరూ ప్రేమ సంతోషములతో వర్ధిల్లాలని ఆయన కోరారు.

మనుషులందరూ అన్యోన్యంగా కలిసి ఉండాలని కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ బ్రతకాలని ఒక మంచి మార్గం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని కాబట్టి ప్రతి మనుషుడు కూడా జీవితాన్ని సంతోషమైన జీవితాన్ని మంచి మార్గాన్ని ఎంచుకొని నడవాలని అప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు కూడా జీసస్ మార్గంలో సత్యము ఉంది గనుక ప్రజలందరూ మంచి మార్గంలో ఉన్నట్లయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని తెలుపుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కలెక్టరేట్ ఎ ఓ ప్రశాంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జీసస్ ఈ లోకంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారని తెలియజేశారుసందేశకులు ఆనంద్ రాజ్ పాస్టర్  దేవుని సందేశం ఇచ్చారు .   ఈ యొక్క కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు  పి శ్రీనివాస్ రావు కోశాధికారి విజయ్ కాంత్ రావు ఉపాధ్యక్షులు భూపతి ప్రభువు కలెక్టరేట్ సూపరిండెంట్  బాలరాజు  అధికారులు ఐ డి ఓ సి లోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.