14 August, 2026 | 8:24 PM

Breaking News

80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన చొప్పరి సదానందం

06-08-2026 03:26 PM

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో పరామర్శ

 బాధితులకు ధైర్యం చెప్పిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు

ముత్తారం,(విజయక్రాంతి) ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మానవత్వాన్ని చాటుతూ మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం గ్రామానికి చెందిన మిన్నాపురం రాధమ్మ, కాల్వ మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి నివాసాలకు వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన చొప్పరి సదానందం, వారి దుఃఖంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కోల విజయ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు అమ్ము రవి, కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాపల్లి సురేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడి కొండల్ రెడ్డి, డాక్టర్ కేవీ చారి, తాటిపాముల శంకర్, ముదురుకోళ్ల నగేష్, గుడి రాములు, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, అల్లం దేవేందర్ రెడ్డి, గుడికందుల కుమార్, మిన్నాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.