మెటాకు కేంద్రం నోటీసులు
04-07-2026 12:00 AM
వివాదాస్పద ప్రకటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై ౩: ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ ‘మెటా’కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు ఉంటున్నాయని, కొన్ని ప్రకటనల వల్ల సైబర్ మోసాల ముప్పు కూడా ఉందని కేంద్రం నోటీసుల్లో పేర్కొంది.
ఆ తరహా వివాదాస్పద ప్రకటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఒకే వారంలో మెటాకు వరుసగా రెండుసార్లు కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వాట్సాప్‌లోని ఓ ఫీచర్ విషయంలో మెటాకు ఇటీవల కేంద్రం నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అది మరువకముందే తాజాగా మరో నోటీసు ఇవ్వడం గమనార్హం.






