16 June, 2026 | 1:53 PM

NEET UG Re-Exam 2026: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్

16-06-2026 12:14 PM

NEET UG 2026 పునఃపరీక్షకు ముందు ప్రశ్నపత్రాల లీకేజీలు, నకిలీ ప్రచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

NEET 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్‌పై ఎందుకు ఆంక్షలు విధించారు?

ప్రశ్నపత్రాల లీకేజీలు, నకిలీ పేపర్ల ప్రచారం, మెసేజ్ ఎడిటింగ్ ద్వారా తప్పుడు టైమ్ స్టాంప్‌లతో మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌లో కొన్ని ఫీచర్లపై తాత్కాలిక ఆంక్షలు విధించింది.

న్యూఢిల్లీ: పరీక్షలకు సంబంధించిన అక్రమాలను అరికట్టేందుకు చేపట్టిన కీలక చర్యలో భాగంగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ (Telegram) మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. జూన్ 21న జరగనున్న NEET (UG) 2026 పునఃపరీక్షకు ముందు ప్రశ్నపత్రం లీక్ కావడం, తప్పుడు సమాచార ప్రచారం, అక్రమాలకు పాల్పడే నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను నిరోధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విద్య, ఉద్యోగాలు, జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్ ను ఫాలో అవ్వండి.

NEET రీ-ఎగ్జామ్‌కు ముందు టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా కోట్ల రూపాయల మోసాలు బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పరీక్ష ముగిశాక పాత టైమ్ స్టాంప్ తో ముఠా నకిలీ ప్రశ్నాపత్రాలు సృష్టిస్తోంది. నకిలీల సృష్టికి అడ్డుకట్ట వేసేందుకే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పై నిషేధం విధించింది. టెలిగ్రామ్ లో 'పేపర్ లీక్ డ్ నీట్' 'రీ నీట్' పేర్లతో టెలిగ్రామ్ ఛానెళ్లు గుర్తించారు. నకిలీ టెలిగ్రామ్ ఛానెళ్లు విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠా  అహ్మదాబాద్ లో 8 టెలిగ్రామ్ ఛానెళ్లను నడుపుతోంది. రూ. 1.50 కోట్ల మోసానికి పాల్పడిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. NEET (UG) 2026 పునఃపరీక్ష నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న నీట్ పరీక్ష జరుగుతుందని NTA ప్రకటించింది.

NEET, JEE, UPSC సహా అన్ని పోటీ పరీక్షల సమాచారం కోసం ఎడ్యుకేషన్ న్యూస్ విభాగాన్ని వీక్షించండి.

FAQ's

1. NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21, 2026న నిర్వహించనున్నారు.

2. టెలిగ్రామ్‌పై ఎందుకు ఆంక్షలు విధించారు?

పేపర్ లీక్‌లు, నకిలీ ప్రశ్నపత్రాల ప్రచారం, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు.

3. టెలిగ్రామ్ పూర్తిగా బ్యాన్ అయ్యిందా?

అధికారిక ప్రకటన ప్రకారం కొన్ని ఫీచర్లపై తాత్కాలిక పరిమితులు విధించినట్లు సమాచారం.

4. NTA ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

పరీక్షల పారదర్శకతను కాపాడటం మరియు విద్యార్థులను మోసాల నుంచి రక్షించడం కోసం.

5. విద్యార్థులు ఏ సమాచారాన్ని నమ్మాలి?

NTA అధికారిక వెబ్‌సైట్, నోటిఫికేషన్లు మరియు ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే నమ్మాలి.