16 March, 2026 | 3:17 AM

పల్లెల్లో సీసీ కెమెరాల నిఘా

16-03-2026 12:00 AM

భద్రతపై సర్పంచుల దృష్టి 

కేసముద్రం, మార్చి 15 (విజయక్రాంతి): కొత్తగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో భద్రతపై దృష్టి సారిస్తున్నారు. గ్రామ పరిపాలన బాధ్యతలు చేపట్టిన కొందరు సర్పంచులు పోలీసుల చొరవతో నేరాల నియంత్రణకు, గ్రామ భద్రతకు కీలకమైన సీసీ కెమెరాల ఏర్పాటుకు నడుం బి గించారు. ఇటీవల గ్రామాల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో నేర పరిశోధనకు, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత ను గుర్తించారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు కొందరు తమ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టారు.

దీనితో గతంలో పట్టణాలకే పరిమితమైన సీసీ కెమెరాల నిఘా ఇ ప్పుడు మారుమూల చిన్న పల్లెలకు సైతం వి స్తరిస్తోంది. కొద్దిపాటి ఖర్చుతో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు నేర నియంత్రణకు అడ్డుకట్ట వేసే విధంగా పనిచేస్తుండడంతో చిన్నచి న్న పల్లెల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు జోరుగా సాగుతోంది. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో ఇటీవల కొత్తగా ఎన్నికైన చిన్న పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామాలకు చెందిన సర్పంచులు గ్రామాల్లో తమతో పాటు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తూ,

ఆయా పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాల వీడియో రికార్డింగ్ నిక్షిప్తమయ్యేందుకు రికార్డింగ్ సిస్టం ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక సీసీ కెమెరా నేర నియంత్రణలో వందమం ది పోలీసులకు సమానమని తరచుగా చెబుతుండడంతో ఆచరణ దిశగా భాగస్వాములు అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎ స్పీ గా ఇటీవల బదిలీపై వచ్చిన డాక్టర్ శబరిష్ ప్రతి ఆవాస ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఉపయోగాలను ప్రజాప్రతినిధులకు వివరించి, ప్రతి మారుమూల ఆవాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా పోలీసుల ద్వారా చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలుగా గుర్తింపు ఉన్న కొత్త గూడా, గూడూరు, కేసముద్రం, బయ్యారం తదితర మండలాల్లోనీ పల్లెల్లో సర్పంచుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. సీసీ కెమె రాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సర్పంచులను పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. దీనితో జిల్లా వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు ఇప్పుడు ఊపందుకుంది. 

సీసీ కెమెరాలతో నేర నియంత్రణ

పట్టణాల్లోని అన్ని వార్డుల్లో, గ్రామాల్లోనీ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి జరుగుతోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లు, ప్రతి వార్డులో కౌన్సిలర్లు, అలాగే గ్రామాల్లో సర్పంచుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడానికి కృషి చేస్తున్నాం.

ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులతో ఎస్పీ నేతృత్వంలో నేర నియంత్రణ, డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపై అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత తొందరలో సీసీ కెమెరాలను ప్రతి కూడలిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.

సత్యనారాయణ, సీ ఐ, కేసముద్రం