ఐతురాజ్ పల్లిలో పశువులకు గాలి కుంట నివారణ టీకాలు
31-03-2026 06:47 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని ఐతరాజుపల్లి గ్రామం లో మంగళవారం సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ ఆధ్వర్యం లో పశువులకు గాలికుంట నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 250 పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు వేశారు. గాలి కుంట వ్యాధి నివారణకు పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. జూన్ మాసంలో పశు వైద్యాధికారి ద్వారా ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో పశు వైద్యాధికారి రఘుపతిరెడ్డి, వార్డు సభ్యుడు ఎర్రం రమణ రెడ్డి, గోపాలమిత్ర సూపర్ వైజర్ జూని, గోపాలమిత్రులు తిరుపతి, శ్రీకాంత్, ఫక్రుద్దీన్, సమ్మయ్య, తిరుపతి యాదవ్, సత్యం పాల్గొన్నారు.




