29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

వన్యప్రాణుల సంరక్షణకు క్యాచ్ ద ట్రాప్

09-02-2026 06:59 PM

హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి

అచ్చంపేట: నల్లమల్లలోని వన్యప్రాణులను ఉచ్చుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక క్యాచ్ ద ట్రాప్ (ఉచ్చులను పట్టుకోవడం) కార్యక్రమాన్ని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 2024 నుంచి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్) స్వచ్ఛంద సంస్థ అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూరు, అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, దోమలపెంట, నాగర్ కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ ల పరిధిలలో  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్  భాగస్వామ్యంతో 3462 కిలోమీటర్ల నడక మార్గం పరిధిలో 1076 ఉచ్చులను తొలగించినట్లు చెప్పారు.

వన్యప్రాణులకు హాని తల పెట్టకూడదని, వాటి సంరక్షణ మన సంరక్షణ అని పేర్కొన్నారు. వాటిని జిల్లా అటవీ అధికారి, అమ్రాబాద్ డివిజనల్ అధికారి అచ్చంపేట డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో అటవీ శాఖకు అందించినట్లు చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ సుబూర్, సెక్షన్ అధికారి సుజాత, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు అఖిల్ గౌడ్, శ్రీకాంత్, వికాస్, స్నేక్ క్యాచేర్ సుమన్, ఇతరులు పాల్గొన్నారు.