ఎగువ మానేరు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసిల్దార్ మారుతీ రెడ్డి
04-08-2026 05:52 PM
గంభీరావుపేట,(విజయకాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మారుతి రెడ్డి సూచించారు. డిప్యూటీ కలెక్టర్ నికితతో కలిసి ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, మత్తడి దూకే అవకాశం ఉన్నందున మానేరు వాగు వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. వాగు పరిసరాల్లో పశువులను తీసుకెళ్లడం, కట్టివేయడం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నర్సింగ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






