9 May, 2026 | 11:24 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

చేవెళ్ల బస్సు ప్రమాదం.. ధర్నా చేసిన 25 మందిపై కేసు నమోదు

06-11-2025 01:55 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో రహదారి కోసం ధర్నా చేసినవారిపై పోలీసు కేసు(Police case) నమోదైంది. రోడ్డు బాగు చేయాలని ధర్నాచేసిన 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశారు. ప్రజారహణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు బుక్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం కంకరతో నిండిన టిప్పర్ లారీ టీజీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన(Chevella bus accident) ఘటనలో 14 మంది మహిళలు, 10 నెలల శిశువుతో సహా కనీసం 19 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.  19 మంది మృతికి రోడ్డు సరిగా లేదని ఆరోపిస్తూ తాండూరులో స్థానికులు ధర్నా చేపట్టారు.