16 May, 2026 | 3:59 PM

Breaking News

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •   ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి   •   ప్రజాస్వామ్యానికి భారత్ మాతృదేశం   •   మంథనిలో పశు వైద్య కేంద్రానికి తాళం   •   వంద దినాల పనిని సద్వినియోగం చేసుకోండి   •  

విమానం పక్కనే బస్సు దగ్ధం

29-10-2025 12:00 AM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

ఢిల్లీ, అక్టోబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో ని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బస్సు విమా నం పక్కనే దగ్ధమైంది. ఈ ఘటన విమానాశ్రయంలోని మూడో టర్మినల్ వద్ద జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమా దం సంభవించింది. అయితే బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివే శారు. అలాగే బస్సు సమీపంలో ఉన్న విమా నం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమా దం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు ఇంకా స్పందించలేదు.