21 August, 2026 | 2:07 AM

జీఓ 97రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల వద్ద బీఆర్‌ఎస్‌వీ నిరసన

21-08-2026 12:00 AM

నల్లగొండ టౌన్, ఆగస్టు 20 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏఐసిటి నిబంధనల ప్రకారం స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నాలజీ కింద కొనసాగుతున్న పాలిటెక్నిక్ వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీ ముసుగులో ప్రైవేటీకరణ చేసి బడా బాబులకు అప్పగించడం లో అంతర్యo ఏమిట ని నిలదిశారు.

పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అంటే నిరుపేద విద్యార్థులకు వృత్తి విద్యను దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి జీవో 97ను ఉపసంహరించుకోవాలని, బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ జిల్లా నాయకులు కాడింగు శ్రీకాంత్ గౌడ్, బకరం నరెందర్, రమేష్, వెంకటేష్, ఆంజనేయులు, రాజు కుమార్, శివ, మురళి, సురేష్, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.