1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

లిక్కర్ కేసుతో బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం

28-02-2026 12:45 AM
  1. మద్యం కుంభకోణం సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు

కవితకు కోర్టులో న్యాయం జరిగింది

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : మద్యం కుంభకోణం కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపో యిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను మనం చూశామని, అసత్య పూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి,

మా ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’లో అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరికి, న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.