2 July, 2026 | 3:39 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

28-04-2026 01:16 AM

బూర్గంపాడు, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు.

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి రానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పొక్కుల రవి,లక్ష్మీపురం ఉప సర్పంచ్ యారం పున్నారెడ్డి, మాజీ వార్డు మెంబర్ కామిరెడ్డి పద్మ, మూల బాలిరెడ్డి గారు, కురుకుంట్ల చిన్నప్పరెడ్డి, చేతుల పెద్ద వీర్రాజు, గంగుల చంద్రశేఖర్ రెడ్డి, బొర్ర భద్రయ్య, కొప్పుల గిరి, టెలీఫోన్ రాము, షేక్ జమల్, షేక్ మౌలానా, నాగులమీర, నిజాముద్దీన్ పాల్గొన్నారు.