07-02-2026 01:16:26 AM
నిరుపేదల సంక్షేమం... వార్డు అభివృద్దే నా ప్రధాన లక్ష్యం
20 వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి
వనపర్తి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మీ ఇంటి బిడ్డగా మీ అందరికి సేవ చేసుకునేందుకు బి ఆర్ ఎస్ పార్టీ తరుపున 20 వ వార్డు నుండి ఫోటి చేస్తునాన్నని అందరు మనసుపూర్తిగా ఆశీర్వదించాలని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రం లో ని 20 వ వార్డు లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంను నిర్వ హించి కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా అభ్యర్థి మాట్లాడుతు నిరుపేదల సంక్షేమం వార్డు అభివృద్దే నా ప్రధాన లక్ష్యంగా మీ ముందుకు వచ్చానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డు ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళతానని ఆయన హామీ ఇచ్చారు. మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయకుండా మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్నారని మోసం చేసే కాంగ్రెస్ నాయకులకు ఓటు తో తగిన బుద్ది చెప్పాలన్నారు. అభివృద్ధి సంక్షేమం దిశగా పాటు పడిన బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి విజ్ఞప్తి చేశారు.