21 April, 2026 | 2:35 AM

కో-ఆప్షన్ సభ్యుల కోసం దరఖాస్తులు సమర్పించిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు

21-04-2026 12:05 AM

మెదక్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి) : మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కో- ఆప్షన్ సభ్యుల పదవులకు సంబంధించి బిఆర్‌ఎస్ పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులు సోమవారం దరఖాస్తులు సమర్పించారు. వంజరి జయరాజ్, మెంగాని విజయలక్ష్మి, నౌషిన్, ఫాజిల్ తదితరులు మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, సురేందర్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్ల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి తమ దరఖాస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున గౌడ్, సురేందర్ గౌడ్ మాట్లాడుతూ..త్వరలో జరగబోయే మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కౌన్సిలర్లను కోరారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతినేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించిన వారు బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తారని తెలిపారు.

కౌన్సిలర్లకు నిర్మాణాత్మక సూచనలు అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 32 మంది కౌన్సిలర్లు తమ అమూల్యమైన ఓటును బిఆర్‌ఎస్ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ విప్కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై మున్సిపల్ సిడిఎంఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఇటీవల పార్టీ మారిన కౌన్సిలర్లను   హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో-కన్వీనర్ గడ్డమీది కృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, మాయ మల్లేశం, విజయలక్ష్మి, నాయకులు సాయి కుమార్, శ్రీను నాయక్, వేణు తదితరులు పాల్గొన్నారు.