4 May, 2026 | 2:42 AM

ముగిసిన బ్రహ్మోత్సవాలు

04-05-2026 01:20 AM

సూర్యాపేట, మే 3 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం చక్రస్నానంతో ముగిశాయి.  చివరి రోజున మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహించారు. తదుపరి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

సాయంత్రం వేళ తూడి దేవేందర్ రెడ్డి ఝాన్సీలక్ష్మి దంపతులు, డాక్టర్ చంద్రశేఖర్ ప్రశాంతి దంపతులు పుష్పయాగం, ధ్వజావరోహణ, ఏకాంత సేవలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు హరిచరణ్ ఆచార్యులు, ఈవో శ్రీనివాసరెడ్డి శ్రీ హరి ఆచార్యులు బజ్జూరి కృష్ణయ్య గజ్జల రవీందర్ కవిత జ్యోతి అరుణ రజిత పల్లవి తదితరులు పాల్గొన్నారు.