4 July, 2026 | 2:52 PM

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

04-07-2026 01:54 PM

న్యూఢిల్లీ: పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌పై(Telegram) చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం(Centre Government) హెచ్చరించింది. పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్, ఇతర ఆడియో-విజువల్ అంశాలు తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందడాన్ని అరికట్టాలని ఆదేశిస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'కు కేంద్రం నోటీసు జారీ చేసినట్లు ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన నోటీసులో టెలిగ్రామ్ నుండి 15 రోజుల్లోగా చర్యల నివేదికను (Action Taken Report) కోరింది.

పైరసీ కంటెంట్‌ను అప్పుడప్పుడు తొలగించే విధానం నుండి ప్లాట్‌ఫారమ్ జవాబుదారీతనం వైపు ప్రభుత్వం తన విధానాన్ని మారుస్తోందని అధికారులు పేర్కొన్నారు. NEET పునఃపరీక్ష సమయంలో ప్రశ్నపత్రం లీక్ కాకుండా నివారించేందుకు తీసుకున్న ముందస్తు చర్యగా జూన్ నెలలో దేశంలో తాత్కాలికంగా నిలిపివేయబడిన టెలిగ్రామ్ (Telegram) సంస్థకు మంత్రిత్వ శాఖ ఒక విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ పరమైన ఉల్లంఘన మాత్రమే కాదు, అది 'కాపీరైట్ చట్టం-1957', 'సినమాటోగ్రాఫ్ చట్టం-1952' ప్రకారం ఒక క్రిమినల్ నేరమని తెలిపింది.