4 May, 2026 | 2:42 AM

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు

04-05-2026 01:21 AM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల, మే 3  : ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం  నకిరేకల్ పట్టణంలో  మూసీ రోడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రోజులు తరబడి నిల్వ ఉన్న ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నకిరేకల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. రైతులు సమస్యలు అడిగితే దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆయన కోరారు.