10 August, 2026 | 10:22 AM

ఈనెల 23న ఘనాపూర్, 30న ఘట్కేసర్ లో బోనాల పండుగ

10-08-2026 09:00 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : ఘట్ కేసర్, ఘనాపూర్ లలో నిర్వహించే బోనాల పండుగ తేదీలను గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాలు, పనిబాట్ల వారి సూచనలు, అభిప్రాయాల మేరకు ఘనాపూర్ లో ఈనెల 23న (ఆదివారం), ఘట్ కేసర్ లో ఈనెల 30న (ఆదివారం) గా ఖరారు చేయడం జరిగింది. ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, గ్రామ ప్రజలు కలిసి అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు.