8 August, 2026 | 6:54 PM

బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా బోనాల పండుగ

08-08-2026 03:15 PM

* ఆడిపాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

చంపాపేట్,(విజయక్రాంతి): బ్రిలియంట్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు పండుగ వాతావరణంలో, అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు బోనాలు ఎత్తుకొని రాగా, పోతురాజుల వేషధారణలు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.​

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అచితారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతీ ఒక్కరూ పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగల విశిష్టతను, మన ఆచారాలను విద్యార్థులకు తెలియజేసేందుకే పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.​ ఈ వేడుకల్లో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తో పాటు ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.