calender_icon.png 11 February, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునిపల్లి గ్రామంలో బాంబుల మోతలు

11-02-2026 01:21:47 AM

  1. నిబంధనలు పాటించని క్రషర్ క్వారీలు 

నిత్యం నరకం చూస్తున్నాం అంటున్న గ్రామస్తులు 

భయాందోళనలో గ్రామస్తులు 

పట్టించుకోని అధికారులు 

హనుమకొండ, ఫిబ్రవరి ౧౦ (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మునిపల్లి గ్రామంలో ప్రతిరోజూ ఉదయం బాంబుల మోతలు ,రాత్రులు దు మ్ము ధూళితో మునిపల్లె గ్రామ వాసుల భ యపడుతూ బాధపడుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న క్రషర్ క్వారీలతో గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస నియమ నిబంధనలు పాటించని క్రష ర్ క్వారీలపై గ్రామస్తులు కన్నెర్ర చేస్తున్నారు.

తెల్లారిందంటే దట్టమైన మేఘాలు గ్రామా న్ని కమ్ముకున్నాయా..? అన్నట్టుగా, దుమ్ము ధూళితో ,భారీ శబ్దాలతో గ్రామాన్ని అల్లుకుపోతుంది. పేలుళ్ల దాటికి గుండెలు గుబు లుమంటూ, ఇండ్లు బీటలు వాలుతున్నాయి. గోడలు పగులు వాలుతున్నాయి. పేలుళ్ల దాటికి బండరాళ్లు వచ్చి ఇంటిపై పడడంతో పైకప్పులు దెబ్బతింటున్నాయనీ గ్రామస్తులు వాపోతున్నారు. మునిపల్లె గ్రామవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలాన్ని వెల్లదీస్తున్నారు.

మునిపెల్లి గ్రామం చుట్టూ అనేక క్రషర్, క్వారీలు ఉన్నాయి.వాటిలో అధికారికంగా,ప్రభుత్వ అనుమతితో నడిచేటివి కొన్ని, అనధికారికంగా రాజకీయ నా యకులు అండదండలతో నడిచేటివి మరికొన్ని ఉన్నాయి. గతంలో క్రషర్లకు కావా ల్సిన మెటీరియల్ కొంచెం, కొంచెంగా అం దించేది. ప్రస్తుతం రాజకీయ నాయకుల అం డదండలతో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లకు పా ల్పడుతున్నారు.

భారీ పేలుళ్లకు అమోని యం నైట్రైట్ను ఉపయోగించడంతో ఇంటి భవనాలు పగుళ్లతో దెబ్బతింటున్నాయి. పే లుల నుంచి వచ్చే రాళ్ల ద్వారా అనేకమంది గ్రామస్తులు గాయాలపాలు అయ్యారు.అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టిం చుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రషర్ల క్వారీస్ భారీ నుండి గ్రా మంలోని పంటలను, కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.