calender_icon.png 18 February, 2026 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

18-02-2026 12:26:07 PM

తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని(Telugu states) పలు న్యాయస్థానాలకు బుధవారం బాంబు బెదిరింపులు(Bomb threats) ఎదురయ్యాయి. నాంపల్లి సీబీఐ కోర్టుకు(Nampally CBI Court) మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. నాంపల్లి క్రిమినల్ కోర్టులో బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కోర్టుకు బెదిరింపు కాల్ రావడంతో జడ్జిలు, లాయర్లు, సిబ్బంది కోర్టు నుంచి పరుగులు పెట్టారు.

అటు కరీంనగర్ జిల్లా కోర్టుకు(Karimnagar District Court) బెదిరింపు మెయిల్ అందింది. కోర్టులో బాంబులు పెట్టామని 12 గంటల ఐదు నిమిషాల్లో పేలుతాయని హెచ్చరిక వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు(Rajamahendravaram District Court) కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో న్యాయమూర్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.