3 July, 2026 | 10:25 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

17-04-2026 03:49 PM

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో(Uppal Metro Station) బాంబు బెదిరింపు కాల్‌తో కలకలం రేగింది.  బాంబు బెదిరింపు కాల్ ప్రయాణికుల్లో భయాందోళన కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం, స్టేషన్‌లో బాంబు పెట్టారని ఒక గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్ అధికారులకు ఫోన్ చేశాడు. ఈ సమాచారం తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే భద్రత చర్యలు చేపట్టారు.

బాంబు నిర్వీర్య బృందాలు(Bomb Disposal Squads), డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. విస్తృతమైన గాలింపు తర్వాత, బాంబు బెదిరింపు కాల్‌ ఒక బూటకమని అధికారులు నిర్ధారించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసున్న పోలీసులు నకిలీ కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో విమానాలు, ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, దేవాలయాలు వంటి ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి.