గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
10-04-2026 11:17 AM
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహాంను గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గమనించిన స్థానికులు చేర్యాల పోలీసులకు సమాచారం తెలుపగ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుతెలియని మహిళా మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.మహిళా వయస్సు 35 నుంచి 40 ఏళ్ల పైబడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.మృతురాలి శరీరం పైన నల్లటి బుర్కా తో పాటు ఎర్ర రంగు నైటీ ధరించింది మేడలో తాళిబొట్టుతో పాటు తాయత్తు ఉందని తెలిపారు.ఎవరికైనా మృతరాలి వివరాలు తెలిసినచో ఈ నెంబర్ కు 8712667356 సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.




