29 April, 2026 | 10:23 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

29-04-2026 08:45 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం దమ్మాయిగూడలోని పద్మశాలి టౌన్షిప్ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి పడి ఉన్నాడని ఈనెల 28న స్థానికులు 100కు డయల్ చేశారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికీ మృతి చెందాడని తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య  వయసు ఉంటాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.