20-02-2026 09:00:21 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పది పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అమలులో ఉండే నిబంధనలు