రేపు రక్తదాన శిబిరం
శ్రీరాంపూర్,(విజయక్రాంతి): పూలే, అంబేద్కర్ ల స్పూర్తితో ఈ నెల 13న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బ్రాంచి అధ్యక్షులు గుల్ల బాలాజీ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా దేశానికి విజ్ఞానం పంచిన మహనీయులు జ్యోతి బాపూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 13న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి హాజరవుతారన్నారు. ఈ శిబిరానికి సింగరేణి కార్మికులు, కార్మికేతరులు, అభ్యుదయ భావాలు గల ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.




