29 March, 2026 | 4:30 AM

చెత్తను తొలగించాలంటూ బీజేపీ ఆందోళన

29-03-2026 02:09 AM
  1. బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌ను డంప్ యార్డ్‌గా చేశారు

ఆందోళనలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

సికింద్రాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి ప్రశంసలు అందు కున్న బోయిన్ పల్లి కూరగాయాల మార్కెట్ ను నేడు జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డులా తయారు చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో కార్మికులు, వ్యాపారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా నిర్వహించారు.

ప్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన కోసం రూ. లక్షల కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో 9 నెలలుగా చెత్త కాంట్రాక్టర్ కు నెలనెలా రూ.7 లక్షలు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.టాయిలెట్లు వసతులు లేక మార్కెట్ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని సంబంధిత వ్యవసాయ మంత్రి సిగ్గుతో రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు.

బోయిన్ పల్లి మార్కెట్ యార్డుకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదా యం సమకూరుతుందన్నారు. ప్రతి రోజు వేలాది మంది కార్మికులు, హమాలీలు, రైతు లు, వ్యాపారులు వ్యాపార కాల్యాపాలు నిర్వహిస్తున్నారు. బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు లేక వ్యాపారులు, హమాలీలు రైతులు, అల్లాడుతుంటే ప్రజా పాలనం టూ గొప్పలు చెప్పుకునే పాలకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించకపోవడంతో పదిహేను రోజులుగా మార్కెట్ లో చెత్త తీయడం లేదన్నారు. దీంతో మార్కెట్ దుర్గంధం వేద జల్లుతుందని, కార్మికులు, వ్యాపారులు, రైతులు అనారోగ్యాల పాలవుతున్నట్లు ఈట ల ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డు లో సమస్య పరిష్కరమయ్యేంత వరకు మార్కెట్ యార్డును నుంచి కదిలేది లేదని ఈటల స్పష్టంచేశారు.

కార్మిక,హమాలీ, ట్రాన్స్ ఫోర్ట్, హోల్ సేల్ వ్యాపారుల సంఘ ప్రతినిధులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చి, మార్కెట్ లో సమస్యలన్నీ పరిష్కరించే వరకు ఇక్కడే బైఠాయిస్తానని ఈటల రాజేందర్ హెచ్చరించా రు. చెత్త అంత తరలించి, తాగునీరు ఏర్పా టు చేసేంతవరకు, బయోగ్యాస్ ప్లాంట్ ను వినియోగంలోకి తెచ్చేంత వరకు, టాయిలెట్లకు డోర్లు,

నీరు సరఫరా చేసేంత వరకు, మొత్తంగా మార్కెట్‌ను శుభ్రం చేసేంత వర కు ఇక్కడే ఉంటాని, అప్పటి వరకు అవసరమైతే మార్కెట్ యార్డును బంద్ చేసి సమ స్యల పరిష్కారం కోసం పోరాడుతానని స్ప ష్టంచేశారు. ధర్నాలో హోల్ సేల్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షులు సోమ దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు, శ్రీకాంత్ రెడ్డి, చంద్రారెడ్డి, హమాలీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.