పొంగులేటి రాజీనామా చేయాలి
నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
నస్పూర్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత(Section 22A) భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అదే విధంగా 22 GOలో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. నిషేధిత భూముల విషయంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.
బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ GOల పేరిట పేద మధ్య తరగతి ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 22 GOలో అనేక తప్పిదాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర మంత్రులు ఒప్పుకున్నారని, జరిగిన తప్పిదాలకు, జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటుకు కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, రమణ రావు, కమలాకర్ రావు, ఆకుల అశోక వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ సప్న రాణి, బొడ్డు రఘునందన్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, బింగి ప్రవీణ్, నల్ల రవి, మద్ది సుమన్, రాకేష్ రెన్వ, సల్ల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






