భవిష్య దర్శిని పాఠశాల గుర్తింపు రద్దు
ఆర్మూర్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం కొటార్మూర్–పెర్కిట్‌లోని భవిష్య దర్శిని ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ విద్యా శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పాఠశాలలో ఓ విద్యార్థులకు మరో వర్గానికి చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు కలిసి ఉర్దూ నేర్పించడంతో పాటు నమాజ్ చేయడం, కల్మా చదివించడం చేసారంటూ తల్లిదండ్రులు బీజేపీ నాయకుల సహాయంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన విషయం విదితమే. కాగా ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలపై పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి.
తాజాగా పూర్తి స్థాయి విచారణ అనంతరం విద్యా శాఖ అధికారులు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పాటశాల గుర్తిపు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాఠశాల సమీపంలో ఉన్న పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెర్కిట్–కొటార్మూర్‌లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వాగ్దేవి పాఠశాల, కాంతి పాఠశాల, శ్రీ విద్యానికేతన్ పాఠశాలల్లో తమకు నచ్చిన పాఠశాలలో తమ విద్యార్థులను చేర్పించుకోవాలని సూచించారు. అనంతరం అసిస్టెంట్ కమీషనర్ ఎక్సామినేషన్ బాళోజి, ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం నేతృత్వంలో భవిష్య దర్శిని పాఠశాలకు సీజ్ చేసారు.






