14 July, 2026 | 3:24 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

30-12-2025 01:09 AM
  1. గోదావరిలో హంస వాహనంపై నది విహారం చేసిన సీతారాములు
  2. తరలివచ్చిన భక్తులు

భద్రాచలం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుం ఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి గోదావరి నది తీరంలో కన్నుల పండువగా సీతారామచంద్రస్వామి వారి తేప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. 

వేలాది మంది భక్తులు స్వామివారి తెప్పోత్సవం తిలకించి పరవశించిపోయారు. మంగళవారం ఉదయం మిథిలా స్టేడియం వద్ద వైకుంఠ ద్వారం నందు వైకుంఠ ద్వార దర్శనం సైతం దేవస్థానం అధికారులు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. గోదావరి నది తీరంలో విద్యుత్ దీపాలతో అలంకరించబడిన వాహనంపై స్వామివారు నదీ విహారం చేశారు.

ముక్కోటి వైకుంఠ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో డిసెంబర్ 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు భద్రాద్రి రామయ్య అవతారాలు నిర్వహించగా మంగళవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.