14 July, 2026 | 11:47 AM

Breaking News

లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

14-07-2026 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సూచించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ ఎమ్మెల్యేను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పేద, నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి సేవలు, సాధారణ వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన చికిత్సను ఆలస్యం లేకుండా అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సదుపాయాల మెరుగుదలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.నూతన సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.