జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు
అభిందిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థులు 15 మంది అడ్వాన్ అర్హత సాధించారు. మొత్తం 33 మంది జేఈఈ పరీక్షలకు హాజరు గాక అందులో 15 మంది విద్యార్థులు అడ్వాన్స్ అర్హత సాధించారని గౌరవ ప్రిన్సిపాల్ ఆఖరి విజయసాగర్ తెలిపారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా (క్వాలిఫై) అర్హత అయిన విద్యార్థులతో అడ్వాన్స్ పరీక్షలో బాగా రాణించాలని దేశంలోని అత్యున్నతమైన విద్యాసంస్థలైన ఐఐటీలో సీట్లు సంపాదించి ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని దిశా నిర్దేశ చేశారు.
అదేవిధంగా ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు కుమార్ దీపక్ విద్యార్థులను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ రెసిడెన్షియల్ సీ ఓ ఈ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు అర్హత సాధించడం పట్ల కలెక్టర్ విద్యార్థులను అభినందించి పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ,అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి సేవలు కుటుంబానికి అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా డి సి ఓ రమా కళ్యాణి విద్యార్థులను అభినందించారు. జడ్ ఓ గిరిజ ఫోన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపక బృందం విద్యార్థులకు పుష్పగుచ్చమిచ్చి అభినందిస్తూ ఫైనల్స్ ఎగ్జామ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
- అర్హత సాధించిన విద్యార్థులు..
జే ఈ ఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత ను 15 మంది విద్యార్థులు సాధించారు. వారిలో మైలరపు విశ్వతేజ 84 . 58, డౌనే ఆదర్శ్ 83.92 గోదారి అంజన్న 82.41, రంటెంకి గిరిధర్ 82.00, దుర్గం అభిరామ్ 79.46 రాంటెకి హవీష్ 77.50, ఆవునూరి మనీష్ 72.11 దుర్గం యశో మార్ 70.70, జాడి జయవర్ధన్ 68.35, కామెరా బెన్ని 65.85, కలసి ధనుష్ 65.40, కొండగుర్ల రామ్ చరణ్ 65.15, ముడీమడుగుల రామ్ తేజ 64.88, బట్టి క్రాంతి రణ దేవ్ 53.96, మడికొండ అవినాష్ 32.95( PHC) ఉన్నారు.






