09-02-2026 01:45:56 AM
కేంద్ర, రాష్ట్ర మంత్రుల విస్తృత ప్రచారం
హంగ్ దిశగా కరీంనగర్ కార్పొరేషన్
కరీంనగర్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికలు ఆ ఆరుగురు మంత్రు లు, మాజీ మంత్రులకు అగ్ని పరీక్షగా మా రాయి. తమ తమ ప్రాంతాల్లో బల్దియా పీ ఠంపై జెండా ఎగురవేయడంతోపాటు ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల గెలు పు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియ నుండడంతో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు కా ర్పొరేషన్ల పరిధిలో మంత్రులు విస్తృతంగా పర్యటించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ పై కాపాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆదివారం తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు విజయ సంకల్ప ర్యాలీని నిర్వహించారు. ఆయన ఇప్పటికే డి విజన్లలో, చొప్పదండి, హుజురాబాద్, జ మ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలలో విస్తృతంగా పర్యటించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథనితోపాటు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఇక్కడే కాకుం డా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఆయన పలు డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా ప్ర చారం నిర్వహించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, ర వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ తోపాటు కరీంనగర్ లో పర్యటించారు. ఆదివారం జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగే శ్వర్రావుతో కలిసి పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దకుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన నియోజకవర్గమైన ధర్మపురి కేంద్ర మున్సిపాలిటీతోపాటు జగిత్యా ల, రాయికల్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు సిరిసిల్ల బల్సియాపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా నాయకులను, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. సిరిసిల్లతోపాటు వేములవాడపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించి ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తిరిగి కరీంనగర్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగిరే విధంగా గడప గడపకు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఆరుగురు నేతలకు ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి.
సవాళ్లు, ప్రతినవాళ్లతో వీరు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొప్పదండిలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా శ్రీధర్ బాబు కార్నర్ మీటింగ్ లతో కదనోత్సాహం నింపారు. అయితే ఓటరు నాడి పలుచోట్ల అంతుపట్టకుండా ఉండడంతో ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎవరికివారుగా సర్వేలు చేస్తూ బలహీనంగా ఉన్నచోట పాచికలు వేస్తూ మెజార్టీ స్థానాల కైవసం కోసం శాయశక్తులు ఒడ్డుతున్నారు.
- హంగ్ వైపు కరీంనగర్...
కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉన్నాయి. ఏ పార్టీ జెండా ఎగురవే యాలన్నా 33 స్థానాలు రావాల్సిందే. అయితే ఇక్కడ ఇంటలిజెన్స్ వర్గాల సర్వేలు, ఆయా పార్టీలు నిర్వహిస్తున్న సర్వేల ప్రకా రం హాంగ్ దిశగా ఓటరు నాడి ఉంది. బీజే పీ, బీఆర్‌ఎస్ లకు సమాన స్థానాలు వచ్చి కాంగ్రెస్ కు తగ్గే అవకాశం ఉంది. ఎంఐఎంకు 8 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు 4 లేదా 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. రేపు ఏ పార్టీ బల్దియాపై జెండా ఎగురవేయాలన్నా ఒకరికొ కరి సహకారం తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది.